నేటి నుంచి ఆరోగ్య వారోత్సవాలు
ది లీడర్స్ డైరీ: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఆరోగ్య అవగాహన వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 8 నుంచి జరిగే కార్యక్రమాల్లో ప్రజలకు పలు అంశాలపై అవగా హన కల్పించాలని నిర్ణయించారు. జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులతోపాటు పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవా ఖానాలు, పల్లె ఆసుపత్రుల పరిధిలో ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వివిధ కార్యక్రమాలతో వైద్య సిబ్బంది ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు.
ర్యాలీలతో ప్రారంభం..
సోమవారం ప్రారంబోత్సవ ర్యాలీతోపాటు ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లాలో ర్యాలీలు నిర్వహిస్తారు.
మొదటి రోజు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలో వివరిస్తారు.
మాతా, శిశు సంరక్షణ, ఎయిడ్స్ రాకుండా తీసు కోవాల్సిన జాగ్రత్తలు, మాదక ద్రవ్యాల నివారణ, వాటిని తీసుకొంటే కలిగే అనర్ధాలను వైద్యులు, సిబ్బంది ప్రజలకు తెలియజేస్తారు. ఆరోగ్య అంశా లను పాటించాలని సూచిస్తారు.
ఆరోగ్యంపై అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తామని, ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు.
