గ్రామపంచాయతీలు ఏర్పాటయింది ఎలా..?
దేశానికి స్వాతంత్రం వచ్చాక తొలి ప్రధాని నెహ్రూ నాయకత్వంలో ప్రజాస్వామ్యం సామ్యవాదం నినాదంతో పాలన సాగించారు. 1952లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. ప్రణాళిక బద్ధమైన అభివృద్ధితోపాటు గ్రామీణుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని సంకల్పించారు. ప్రో ఎస్కే డే నేతృత్వంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అమలుపరిచారు. అమలుపై శాస్త్రీయ అధ్యయనానికి సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్త డా. బల్వంత్ రాయ్ మెహతా నేతృత్వంలో అధ్యాయన బృందాన్ని నియమించారు.
వారి అధ్యాయనం ప్రకారం
1. ప్రజల భాగస్వామ్యం కోసం మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం
2. ప్రణాళిక వికేంద్రీకరణ ద్వారా ప్రజల అవసరాలకు అనుగుణంగా వనరులను వినియోగించుకోవడం,
3. శాశ్వతమైన పరిపాలన, అమలు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.దీని ఆధారంగా మహాత్మా గాంధీ ఆశించిన’ గ్రామ స్వరాజ్యం’ లక్ష్యంగా భారత ప్రభుత్వం 1959లో జిల్లా, బ్లాక్ ,గ్రామ ‘పంచాయత్’ అనే మూడు అంచల పంచాయత్ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థను దేశంలో మొదట రాజస్థాన్లో అక్టోబర్ 2న , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా షాద్ నగర్ లో 1959 అక్టోబరు 11న అప్పటి ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. ఈ వ్యవస్థ దశలవారీగా దేశమంతటా అమలైంది
