Headlinesప్రజా సేవలో, దున్న శ్రీనివాసులు.

ప్రజా సేవలో, దున్న శ్రీనివాసులు.

Link Copied!

ప్రజా సేవలో, దున్న శ్రీనివాసులు.

ది లీడర్స్ డైరీ:సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రానికి చెందిన దున్న శ్రీనివాసులు ప్రజా సేవలో దూసుకుపోతున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ , రాజకీయ నేపథ్యం, సామాజిక సేవకుడిగా బాలల హక్కుల పరిరక్షణ కోసం కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో గ్రామ, గ్రామాన ప్రతి పాఠశాలలలో మౌలిక వసతులపై అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఘనత ఆయనకే సాధ్యం, కార్యక్రమము ఏదైనా తన చతర్తతో సమస్యలను సానుకూలంగా పరిష్కరించిన వ్యక్తి శ్రీను. గత పది సంవత్సరాల నుండి జర్నలిస్టుగా ప్రయాణం చేస్తూ సామాజిక సేవా దృక్పథం కలిగిన సున్నిత మనసు ఉన్న దున్న శ్రీనివాసులు సూర్య జర్నలిస్టుగా ఎన్నో కథనాలు రాసి రెండు తెలుగు రాష్ట్రాల ఉత్తమ పరిచయస్తులుగా, కులాలు ఏవైనా సంఘ, సంఘలుగా చీలికలు ఏర్పడిన ఏకతాటిపై తెచ్చిన ఘనత, ఎంత ఎదిగిన ప్రతి వ్యక్తిని, పేరు పెట్టి పిలిసే స్వభావం కలిగిన వ్యక్తి, తన శక్తి సామర్థ్యాలతో పాటు, రాజకీయ నేపద్యం కలిగిన వ్యక్తి, జర్నలిస్టుగా అనేక అభినందనలు, సామాజిక కార్యక్రమాలలో అవార్డులు సాధించారు. ఆయన రాసిన సంచలన కథనాలు ఎన్నో సమస్యలను పరిష్కరించరు, దళిత, బహుజనులకు, సామాన్యులకు న్యాయం జరిగింది. ప్రజా సమస్యలపై ఎన్నో కథనాలు రాసినప్పుడు అధికారులు పాలకుల స్పందన లేక పోవడంతో ఏకంగా ప్రత్యక్ష ఉద్యమానికి దిగాడు. మద్యం కారణంగా యువత, రైతులు, పిల్లలు, సామాన్య ప్రజానీకం సైతం ఆగమావుతున్నారని గుర్తించి ముందుగా మద్య నిషేధం అమలుకు సిద్ధమైన, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్ట కూడదని ముందుగా బెల్ట్ షాపులు బంద్ చేస్తే కొంత మేర గ్రామాల్లో శాంతి వాతావరణం నెలకొంటుందని ముందుగా స్వంత గ్రామం అయిన నడిగూడెంలో ప్రయత్నించిన సందర్భం, గతం 20 సంవత్సరాల క్రితంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా బెల్ట్ షాపులు మూసి వేసి గ్రామం లో మద్య నిషేధం అమలు చేయాలని అఖిల పక్షాల ఆద్వర్యం లో ఉద్యమం చేసిన రోజులు మండల వ్యాప్తంగా సంచలనాలే , గ్రామం లో సంపూర్ణ మద్యపాన నిషేధం అప్పట్లో అమలు చేశారు. అనంతరం, ప్రస్తుతం మండలం లో శ్రీరంగాపురం గ్రామం మాత్రమే కొనసాగుతుంది, గ్రామాలలో ఆయా గ్రామాల యువత స్వచ్ఛంద సేవా సంస్థలు సహకారం తో మద్య నిషేధం అమలు చేస్తే బాగుండేది. మద్య నిషేధం అమలు కొనసాగుటకు సహకారం అందించి మండలం లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. మండల సేవా సంఘాల ప్రధాన రహదారి పై భారీగా గుంతలు ఏర్పడి. రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితులలో తన అనుచర గనంతో మరమ్మతులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయాల పై వార్తలు రాసినా అధికారులు స్పందించక పోవడం తో ఏకంగా జేఏసీ సంఘాల ఆద్వర్యం లో జెసిబి ల సహాయంతో బరాకత గూడెం నుండి నడిగూడెం వరకు మరమ్మతులు చేయించిన పరిస్థితులు మండల ప్రజలకు తెలిసినవే, రోడ్డు పై పాదయాత్రలు, విస్తృత ప్రచారాలు చేశారు. దాంతో స్పందించిన అధికారులు వెంటనే రోడ్డు మరమత్తులు చేపట్టారు. మండలం లో మరెన్నో ప్రజా సమస్యలు, ఓటు విలువలు, సమర్ధ నాయకుణ్ణి ఎన్నుకొనే విధానం పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మండల స్థాయిలో సేవా దృక్పధం గల వారితో మండలం లో అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు, పాదయాత్ర లు నిర్వహించిన ఘనత ఆయనకే సాధ్యం. మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆశీసులతో ఆయురారోగ్యాలు తోడుండాలని వారికివే నూతన పరిపాలన శుభాకాంక్షలు. జర్నలిస్టులకు, రాజకీయ నాయకులకు, అధికారులకు, మండల ప్రజానీకానికి, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద కార్యకర్తలు, అభినందనలు శుభాభినందనలు. మండలం లోనే అతి భారీ మెజార్టీతో 572 తో, గెలుపొందడంతో పలువురు, సన్మానాలతో అభినందనలు తెలుపుతున్నారు.

తాజా వార్తలు

Related Articles