
అవగాహన పెంచుకో.. అభివృద్ధి చేసుకో
ప్రథమ పౌరులకు పాలనపై శిక్షణ
ది లీడర్స్ డైరీ: గ్రామాల్లో పాలకవర్గాలు ఏర్పడి రెండు నెలలు దాటింది. బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు విడతల వారీగా పంచాయతీలో పాలనపై పట్టు కోసం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. సాధారణ పౌరు లుగా ఉన్న వీరు ప్రథమ పౌరులుగా రాణిస్తూ.. మెరుగైన పాలనలో తమ ముద్రను కనబర్చాలి. అందుకు వారికి విధులు, బాధ్యతలపై పట్టు పెంచేసే దుకు ఇలాంటి శిక్షణలు దోహదపడతాయని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధి కారులు భావిస్తున్నారు.
పంచాయతీ ఆదాయ, వ్యయంపై సంపూర్ణంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంపీడీవోలు, ఎంపీవోలు శిక్షణ ఇస్తు న్నారు. గ్రామ సభ నిర్వహణ, వార్డు సభ్యుల పాత్ర వారి బాధ్యతలు, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మొదటి నుంచి చేయాల్సిన కార్యక్రమాలపై వివరిస్తున్నారు. పంచాయతీల్లో కార్యదర్శుల పాత్రపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీలో 40 రకాల రికార్డులు నిర్వహిం చాల్సి ఉంటుంది. వాటి గురించి తెలియజేస్తు న్నారు.
ఇళ్ల నిర్మాణ అనుమ తులు, ఉపాధిహామీ, వన మహోత్సవం, సామాజిక తనిఖీ, పనుల పెంపుపై, శానిటేషన్, చెత్త సేకరించి సెగ్రిగేషన్కు తరలించి అక్కడ సేంద్రియ ఎరువును తయారు చేసి దాని నుంచి ఆదాయం రాబట్టడం,
తిమ్మాపూర్ లో శిక్షణకు హాజరైన సర్పంచులు
ఇంటింటా మరుగుదొడ్లు, వాటి నిర్వ హణ సక్రమం వంటి అంశాలపై 15 రోజులుగా విడతల వారీగా శిక్షణ ఇస్తు న్నారు.
విధులు.. బాధ్యతలు తెలుసుకున్నా..
సర్పంచులు చేయాల్సిన పనులు, అభివృద్ధిలో పాత్ర, గ్రామ సభ ఏర్పాటు చేయడం వంటివి నేర్చుకు న్నాను. గ్రామ అవసరాలపై తీర్మానాలు చేయడం వంటి వాటిపై పూర్తి అవగాహన వచ్చింది. శిక్షణలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను.
-బాసవేని సరోజన, చేగుర్తి సర్పంచి. కరీంనగర్ గ్రామీణ మండలం
తీర్మానాలు.. గ్రామ సభలు
మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించి, సమస్యలను ఎలా పరిష్కరించాలో చక్కగా వివరించారు. గ్రామసభల్లో వేయాల్సిన తీర్మానాలు, అధికారుల పాత్ర, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి. తదితర అంశాలను కులంకశంగా వివరిం వారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి ఏ విధంగా కృషిచేయాలో వివరించారు.
-గుడి రజనీ, చిన్నఆచంపల్లి సర్పంచి, గంగాధర
మొత్తం సర్పంచులు 318
ఇప్పటి వరకు శిక్షణ పొందిన వారు: 203
ఇంకా పొందాల్సిన : 115
