నల్గొండ జిల్లా అనుముల మండలం లో గల నూతనంగా ఏర్పడినా కుపాష్ పల్లి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా గ్రామ సర్పంచ్ శ్రీ పెరుమళ్ళ వేణుగోపాల్ గారు ఒక్కొక్క వార్డ్ మెంబర్ అద్యక్షతన ఒక్కొ కమిటీ నిర్మాణం చేసి అందరికి (వార్డ్ మెంబర్ లకు) వివిధ శాఖలను కేటాయించి అభివృద్ది వేగవంతంగా జరిగేలా ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పగించారు
అభివృధ్ధి లో బాగంగా ఏర్పడిన శాఖలు
1. నీటి పారిశుధ్యం : అడేపు చిన మంగమ్మ
2. మొక్కల సంరక్షణ : పేర్ల సునిత
3. డ్రైనేజీ క్లీనింగ్ : పేర్ల వెంకటయ్య
4. రోడ్ల పరిశుభ్రత : తరి వెంకటమ్మ
5. వీధి దీపాల పరిరక్షణ : షేక్ ఉస్మాన్
6. అంగన్వాడి, ప్రైమరీ స్కూల్ పనితీరు, పర్యవెక్షణ : చింతల లక్ష్మయ్య
