Headlinesగ్రామపంచాయతీ నిర్మాణానికి భూమి విరాళం

గ్రామపంచాయతీ నిర్మాణానికి భూమి విరాళం

Link Copied!

గ్రామపంచాయతీ నిర్మాణానికి భూమి విరాళం – గుడితండాలో తీర్మానం

ది లీడర్స్ డైరీ : తుంగతుర్తి మండలంలోని గుడితండా గ్రామపంచాయతీ నిర్మాణానికి, మరియు VO బిల్డింగ్ లేదా ఇతర ప్రభుత్వ బిల్డింగ్ కోసంఅదే గ్రామానికి చెందిన రైతు లకావత్ హుస్సేన్ నాలుగు గుంటల భూమిని కేటాయించినట్లు దీని విలువ సుమారు రూ :6 లక్షలు విలువ ఉంటుందని
పంచాయతీ కార్యదర్శి శ్రీ చింత సురేష్ తెలిపారు. బుధవారం గుడి తండా గ్రామసభ సమావేశం శ్రీమతి గుగులోతు ఝాన్సీ అధ్యక్షతన జరిగింది. గ్రామపంచాయతీ బిల్డింగు లేక అంగన్వాడి భవనంలో కొనసాగుతుంది , పరిపాలన వ్యవస్థకు ఇబ్బంది కలగడంతో సర్పంచ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ శ్రీమతి గుగులోతు పద్మ, వార్డు మెంబర్లు దారావతు బుజ్జమ్మ, గుగులోతు శ్రీను, గుగులోతు సాగర్, గూగులోతు వినోద, పాతులోతు సరోజా, లకావత్ దామోదర్, లకవోతు భద్రమ్మ,గ్రామ పెద్దలు బానోతు వెంకన్న, గుగులోతు రమణ, పాతులోతు సూర్య, బానోతు భగవాన్, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles