ఓట్ల లెక్కింపు జరుగుతుందిలా..

ది లీడర్స్ డైరీ: పోస్టల్ బ్యాలెట్‌తో సంబంధం లేకుండా ఉదయం 8.30గంటలకు బ్యాలెట్ పెట్టెలోని ఓట్లను లెక్కిం చటం ప్రారంభిస్తారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల వెసు లుబాటును బట్టి ఎన్ని రౌండ్లో తేల్చుతారు. ఒక్కో డివిజన్ /వార్డుకు ఒక్కో టే బుల్ ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా ఆయా డివిజన్/ వార్డు టేబుల్‌పై ఒక్కో బ్యాలెట్ పెట్టెను చేర్చుతారు. ఉదా హరణకు ఒక డివిజన్లో నాలుగు పోలింగ్ కేంద్రాలున్నాయను కుందాం. తొలుత ఒకటో నంబరు పోలింగ్ కేంద్రం బ్యాలెట్ పెట్టెను టేబుల్‌పైకి తీసుకొస్తారు. ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పెట్టెను తెరిచి 25ఓట్లను ఒక కట్టగా కడతారు. పోలింగ్ ముగిశాక ఆం జారీచేసిన లెక్కలకు.. పెట్టెలోని ఓట్లను సరి చూసుకునేందుకు ఏజెంట్లకు అవకా శమిస్తారు. ఇలా నాలుగు బ్యాలెట్ పెట్టెల్లోని ఓట్లను కట్టలుగా కట్టి డ్రమ్‌లో పోస్తారు. అనంతరం డ్రమ్లోని 40 కట్టలను (అంటే 1,000 ఓట్లు) తీస్తారు. వాటిని గుర్తుల వారీగా వేరు చేస్తారు. డ్రమ్ లోని ఈవిధంగా మొత్తం కట్టలను గుర్తుల వారీగా విడగొ డతారు. తరువాత అభ్యర్ధుల వారీగా వచ్చిన 100 ఓ ట్లను ఒక కట్టగా కడతారు. ఈప్ర క్రియ పూర్తయ్యాక తుది కౌంటింగ్ ప్రారంభిస్తారు. కౌంటింగ్ అధికా రులు, అభ్యర్ధుల ఏజెంట్ల సమక్షంలో ఈ తంతు జరుగు తుంది. ఆర్ ఓ పర్యవేక్షిస్తారు. డివి జన్/వార్డులోని మొత్తం పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ పెట్టెలోని ఓట్లను లెక్కించాక గెలు పొందిన పార్టీ/అభ్యర్థిని కౌంటింగ్ సూపర్వైజర్ నిర్ధారిస్తారు. ఆనం తరం విజేతకు ఆర్ఓ ధ్రువపత్రం అందజేస్తారు. ఇక్కడితో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
