Headlinesఅన్మాస్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం..

అన్మాస్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం..

Link Copied!

అన్మాస్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం..

– గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై పర్యవేక్షణ..

– సర్పంచ్ నేనావత్ శ్రీనునాయక్..

ది లీడర్స్ డైరీ: రంగారెడ్డి జిల్లాకడ్తాల్ మండలం అన్మాస్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంగ న్వాడీ కేంద్రంలో శనివారం జరిగిన అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిన్నా రులకు విద్యారంభానికి సంకేతంగా నిర్వ హించిన ఈ కార్యక్రమంలో తల్లి దండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గర్భి ణీలు, బాలింతలు మరియు చిన్న పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆహార నాణ్యత, పోషక విలువలు సరిగా ఉండేలా అంగన్వాడీ టీచర్కు అన్మాస్ పల్లి సర్పంచ్ నేనావత్ శ్రీను నాయక్ సలహాలు, సూచనలు ఇచ్చారు. పిల్లల ఆరోగ్యం, గర్భిణీల సంక్షేమం దృష్ట్యా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందిస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేనావత్ శ్రీను నాయక్, పంచాయతీ కార్యదర్శి ఇందిర, వార్డు సభ్యుడు కంబాల ప్రశాంత్, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు లింగంపల్లి రాజు, గర్బిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles