

సారపాకలో నూతన సంవత్సర వేడుకలు, బీపీసీ యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరణకు హాజరైన మాజీ జడ్పీటీసీ
సారపాక పట్ట ణంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు మరియు *బీపీసీ (BPC) యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరణ కార్యక్రమం* ప్రెస్ క్లబ్ ఆఫ్ బూర్గంపాడు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు *తాళ్లూరి శ్రీహరిబాబు* అధ్యక్షత వహించగా, *ఐటిసి భద్రాచలం యూనిట్ హెడ్ శైలేంద్ర సింగ్* ముఖ్య అతిథిగా, *మాజీ జడ్పిటిసి సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత* విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం *బీపీసీ యూట్యూబ్ ఛానల్ లోగోను ఆవిష్కరించి*, ఛానల్‌ను అధికారికంగా ప్రారంభించారు.
తదుపరి కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు తాళ్లూరి శ్రీహరిబాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు *మూల వెంకటరమణ రెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి **ఆవుల మహేశ్వర రెడ్డి* ముఖ్య అతిథులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు ప్రముఖ కాంట్రాక్టర్ *పాకాల దుర్గాప్రసాద్, సారపాక గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ **కన్నేదారి రమేష్, సొసైటీ మాజీ చైర్మన్ **బిక్కసాని శీను, మాజీ ఎంపీటీసీ సభ్యులు **వల్లూరి వంశీకృష్ణ, ఐటిసి గుర్తింపు సంఘం యూనియన్ నాయకుడు **కనకమెడల హరిప్రసాద్, సీపీఎం పార్టీ నాయకుడు **భక్తుల వెంకటేశ్వర్లు, బీజేపీ పార్టీ నాయకుడు **ఏనుగుల వెంకటేశ్వర రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త **జలగం చంద్రశేఖర్* తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
