Headlinesవార్డు అభివృద్ధిపై రాజీ లేదు

వార్డు అభివృద్ధిపై రాజీ లేదు

Link Copied!

వార్డు అభివృద్ధిపై రాజీ లేదు,అధికారులు సమన్వయంతో పనిచేయాలి

23వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

కౌన్సిలర్ పూజిత జహంగీర్
ది లీడర్స్ డైరీ: మున్సిపల్ పట్టణ పరిధిలోని 23వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని కౌన్సిలర్ బర్రె పూజిత-జహంగీర్ తెలిపారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.
సోమవారం వార్డు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, వార్డు అభివృద్ధి విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల సౌకర్యాల కోసం అవసరమైన ప్రతి అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని ఆదేశించారు.
వార్డులో స్ట్రీట్ లైట్లు, ఐమాక్స్ లైట్లు, మురికి కాలువల పునర్నిర్మాణం, సీసీ రోడ్ల అభివృద్ధి వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహిళా సంఘాల విషయమై మాట్లాడుతూ, ప్రస్తుతం 22 సంఘాల్లో ఐదు సంఘాలకు మాత్రమే మ్యాచింగ్ గ్రాంట్ వచ్చిందని, మిగిలిన సంఘాలకు కూడా గ్రాంట్లు వచ్చేలా అధికారులు కృషి చేయాలని కోరారు.
“వార్డు అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా అధికారులు ముందుండాలి. 23వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడం మన అందరి బాధ్యత” అని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో వార్డు ఆఫీసర్ అనిల్ నాయక్, ఆర్పీలు సుదర్శనం మంజుల, బొట్టు రాధ, నీటి సరఫరా సిబ్బంది, సానిటేషన్ ఇంచార్జ్ జవాన్ బర్రె శ్రీధర్, వార్డు పెద్దలు బండారు రవి వర్ధన్, ఐలాపురం బాబు, దర్గాయి దేవేందర్, పోకల నాగరాజు, కడారి అనిల్, గాయపాక వెంకటేష్ (సచిన్), బర్రె క్రాంతి, పెంబర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles