సర్పంచులకే అధికారాలు
అంగన్వాడీ కేంద్రాలపై పంచాయతీల పర్యవేక్షణ
అక్రమాల అడ్డుకట్టకు చర్యలు
ది లీదర్స్ డైరీ : అంగన్వాడీ కేంద్రాలను ఇక సర్పంచులు పర్మ వేక్షించనున్నారు. ఈమేరకు ప్రభుత్వం వారికి అధికారాలను కట్టబెట్టనుంది. పౌష్టికాహారం పంపిణీలో ఆక్రమాలకు తావు లేకుండా కేంద్రా లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గతంలో పర్యవేక్షణ కమిటీ లను ఏర్పాటు చేయగా….
పంచాయతీ పాలకవర్గాల కాలపరిమితి ముగిసిన తర్వాత రెండేళ్ల పాటు సర్పంచులు లేకపోవడంతో ఇవన్నీ నామమాత్రంగానే మారాయి. చాలాచోట్ల వనపర్తి సక్రమ పర్యవేక్షణ లేక అక్ర మాలు జరిగాయి. పౌష్టికాహారం పక్కదారి పట్టిందని గుర్తించిన ప్రభుత్వం కొత్త కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించింది. గ్రామ పంచా యతీల పాలకవర్గాలు కొలువుదీరడంతో నూతన కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంబున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 4,322 అంగన్వాడీ కేంద్రాల్లో 192,789 మంది చిన్నారులు ఉన్నారు.
కమిటీ చైర్మన్ సర్పంచి: అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ కమిటీకి సర్పంచి చైర్మ న్గా వ్యవహరిస్తారు. ఇందులో 11 మంది సభ్యులుంటారు. కన్వీన రుగా ఆంగన్వాడీ ఉపా ధ్యాయిని, సైన్స్ బోధించే ప్రభుత్వ పాఠశాల ఉపా ధ్యాయుడు, విశ్రాంత ఉద్యోగి, ఏఎన్ఎం. చిన్నా రుల తల్లులు సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి పాల మూరు జిల్లాలో 1,684 గ్రామ పంచాయతీల పరిదిలో 18 అంగన్వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 4,322 కేంద్రాలు ఉండగా అందులో 1,049 కేంద్రాలను అద్దె భవ నాల్లో నిర్వహిస్తున్నారు. మిగతా 3,273 అంగ న్వాడీ కేంద్రాలను సొంత భవనాలు, ప్రాథమిక పాఠశాలలు, కమ్యూనిటీ భవనాల్లో నిర్వ హిస్తున్నారు. పురపాలికల పరిధిలోని కేంద్రా లను మినహాయించి అన్ని గ్రామ పంచాయ తీల పరిధిలోని కేంద్రాలకు సర్పంచి చైర్మన్గా ఉంటారు.
ప్రత్యేక నిఘా: ప్రభుత్వం నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవు తున్న సరకులు ప్రతినెలా వచ్చేలా పర్య వేక్షిస్తారు. వాటి నాణ్యత పరిశీలిస్తారు.. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందించే భోజనం నాణ్య తను తనిఖీ చేస్తారు. పిల్లలు, గర్భిణు లతో పాటు కేంద్రాలకు వచ్చే వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెలా రూ. లక్షల విలువైన బాలామృతం, పాలు, గుడ్లు, బియ్యం, కందిపప్పు, తదితర పోషక విలువలు కలి గిన ఆహార పదార్థాలను లబ్దిదారులకు అందేలా చూస్తారు.
