
వైద్యుల సలహాలు సూచనలు గర్భిణీలు పాటించాలి
చందన వెళ్లి ఆసుపత్రి వైద్యాధికారి
ది లీడర్స్ డైరీ:గర్భిణులు ఆరోగ్యంగా ఉండి పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని చందనవెళ్లి ప్రభు త్వ ఆస్పత్రి వైద్యాధికారి ప్రణీత్ అన్నారు. మం డల పరిధిలోని చందనవెళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సురక్షిత మాతృత్వ కార్యక్రమాన్ని బుధవారం సర్పంచ్ చేవెళ్ల నవనీతస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మాతృత్వ పద్ధతులు, పోషకాహారం వాటిపై గర్భిణులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో వైద్యసిబ్బంది, గర్భిణులు, మహిళలు తదితరులు ఉన్నారు.
