దిలీదర్స్ డైరీ ఫిబ్రవరి 19: రామగుండం నగర పాలక సంస్థ నూతన మేయర్‌గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మహంకాళి స్వామి గురువారం రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి, పూల మొక్కను బహూకరించారు. నగరాభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందించాలని కోరారు. కమీషనర్ అంబర్ కిషోర్ ఝా.. మేయర్ మహంకాళి స్వామికి అభినందనలు తెలిపారు.
