Headlinesగ్రామ పంచాయతీలకు రూ.259.36 కోట్లు

గ్రామ పంచాయతీలకు రూ.259.36 కోట్లు

Link Copied!

గ్రామ పంచాయతీలకు రూ.259.36 కోట్లు

15వ ఆర్థిక సంఘం నిధులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్తొ తోలి విడుత విడుదల చేస్తూ ఉత్తర్వులుమొత్తంగా పెండింగ్లో రూ.3 వేల కోట్లు

మిగిలిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలి :మంత్రి సీతక్క

ది లీడర్స్ డైరీ :గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ.259. 36 కోట్లను విడుదల చేసింది. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల గత రెండేళ్లుగా నిలిచి పోయాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం, సుప్రీంకోర్టు తీర్పు కారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడం ఈ జాప్యానికి ప్రధాన కారణ మైంది. ఎన్నికలు లేని పరిస్థితిలో నిధుల విడుదల సాధ్యం కాదన్న కేంద్ర వైఖరితో గ్రామ పంచాయతీలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే కేంద్రమంత్రు లకు రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి

శాఖ మంత్రి మంత్రి సీతక్క పలు దఫాలుగా విజ్ఞప్తి చేశారు. పంచాయతీల ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోపాటు ఇతర కేంద్రమం త్రులను కలిసి విన్నవించారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులకు ఆటంకాలు, ప్రజల అసౌకర్యాన్ని వివరించి నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఎన్నికల్లేక ఆగి.. ఎట్టకేలకు..

అయినప్పటికీ ఎన్నికలు పూర్తికాకపోవడం కారణంగా నిధుల విడుదల సాధ్యపడ లేదు. అయితే ఎన్నికల అనంతరం సైతం నిధుల విడుదలకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపారు. మార్చి 31 లోపు నిధులు విడుదల కాకపోతే శాశ్వతంగా రద్దు అయ్యే ప్రమాదం ఉండటంతో ప్రక్రియను వేగవంతం చేశారు. సంబంధిత శాఖ అధి కారులతో పలుసార్లు సమీక్షలు నిర్వహించి నిధులు తీసుకువచ్చే దిశలో దిశానిర్దేశం చేశారు. పంచాయతీ

అభివృద్ధిపై చిగురించిన ఆశలు

15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రానికి మొత్తం సుమారు రూ.3 వేల కోట్ల వరకు రావాల్సి ఉంది. అందులో తొలి విడతగా రూ.259.36 కోట్లను విడుదల చేయడం పట్ల గ్రామ పంచాయతీల్లో ఆశలు చిగు రించాయి. మిగిలిన నిధులు కూడా దశలవారీగా విడుదల చేయాల్సి ఉంది. గ్రామ పంచాయతీలకు ఎంతో కీలక మైన నిధులు విడుద ల కావడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధుల తో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ తాయని, అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. మిగతా పెండింగ్ నిధులను సైతం వెంటనే విడుదల చేయాలని ఆమె కేంద్రాన్ని విన్నవించారు.

ఎన్నికలు పూర్తికావడంతో పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ సీతక్క కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతోపాటు సంబంధిత కేంద్ర శాఖలతో నిరంతర సంప్రదిం పులు జరిపారు. మరోవైపు రాష్ట్ర పంచా యతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.శ్రీ ధర్. ఇతర అధికారులు కూడా కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి నిధుల విడుద లకు కృషి చేశారు. ఈ ప్రయత్నాల ఫలి తంగానే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది.

తాజా వార్తలు

Related Articles