‘పుర’ పోరుకు షెడ్యూలు
రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం
ది లీడర్స్ డైరీ: రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 23 వరకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వ నుంది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుము దిని, పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ మహేశ్ భగవత్పురపాలక కమిషనర్ శ్రీదేవి ఇందులో పాల్గొన్నారు. పోలింగ్ అధికా రులు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్సుల లభ్యత, టీపోల్ సాఫ్ట్ వేర్లో పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్లను మ్యాపింగ్ చేసే ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు.
శిక్షణ: మాస్టర్ ట్రైనర్లకు సోమవారం శిక్షణ పూర్తి కాగా… శిక్షకులకు శిక్షణ కార్యక్రమం బుధవారం ఉదయం పది గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నిర్వహించనున్నారు. అనంతరం వారు జిల్లా స్థాయిలో జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికా రులు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాక 23 తర్వాతే ఎన్నికల షెడ్యూలు విడుదల చేయాలని రాష్ట్ర ఎన్ని కల సంఘం భావిస్తోంది.
