Headlinesసర్పంచులకు బాసటగా నిలుస్తానన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సర్పంచులకు బాసటగా నిలుస్తానన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Link Copied!

ది లీడర్స్ డైరీ : ఇటీవల తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్స్ ఆధ్వర్యంలో జరిగిన రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం సమావేశంలో రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గా ఎన్నికైన షాద్ నగర్ నియోజక వర్గం మధురపూర్ గ్రామ సర్పంచ్ లక్న పురం శివశంకర్ రెడ్డి,పలువురు సర్పంచులతో కలిసి, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ని కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధికి, సర్పంచుల హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధేపల్లి సిద్దార్థ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్ రాంరెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి,జిల్లా సర్పంచుల సంఘం కార్య నిర్వాహక కార్యదర్శి ముడవత్ శ్రీను,సర్పంచులు చిగుర్ల పల్లి రవీందర్ రెడ్డి, చక్కటి శివ కుమార్ యాదవ్,ముడవత్ శ్రీను, శివ రాములు, నర్సమ్మ,నర్సింహులు, మార్కెట్ కమిటీ డైరక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ నేతలు పురుషోత్తం రెడ్డి, కేకే కృష్ణ,జాంగారి రవి తదితరులు పాల్గొన్నారు..

తాజా వార్తలు

Related Articles