Headlinesక్రీడలు శారీరక ధారుడ్యాన్ని పెంపొందిస్తాయి.

క్రీడలు శారీరక ధారుడ్యాన్ని పెంపొందిస్తాయి.

Link Copied!

క్రీడలు శారీరక ధారుడ్యాన్ని పెంపొందిస్తాయి.

సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి.

ది లీడర్స్ డైరీ: క్రీడలు శారీరక ధారుఢ్యాన్ని పెంపొందిస్తాయని కల్వకోల్ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి తెలిపారు. ఆదివారం కల్వకోల్ గ్రామంలో కల్వకోల్ ప్రీమియర్ లీగ్ సెషన్ 8 క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడాకారులు మంచి పట్టుదలతో క్రీడారంగంలో రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలని అన్నారు. క్రీడల వల్ల ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గంలో పయనించాలని ఆమె సూచించారు. యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పులిమామిడి జనార్దన్ గౌడ్, వార్డు సభ్యులు మల్లేష్ యాదవ్, శిరీష మహేందర్, మంగా శ్రీనివాస్, స్వాతి శేఖర్, రాధా కుమార్, శివకుమార్ గ్రామ పెద్దలు అరడి వెంకటేష్, పులిమామిడి వెంకటేష్, మాజీ ఉపసర్పంచ్ చంద్రయ్య, గోవర్ధన్, తిరుమల, రాజశేఖర్, రాజకుమార్, బక్కని నాగరాజ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles