
ఇల్లందు పురపాలక నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం వాయిదా
ది లీడర్స్ డైరీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. పుర ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అభ్యర్థుల ప్రమాణస్వీకారానికి సోమవారం ఆర్డీవో మధు ఆధ్వర్యంలో పురపాలక సమావేశ మందిరంలో ఏర్పాట్లు చేశారు. మొత్తం 24 మంది అభ్యర్థులు ప్రమాణస్వీకారానికి హాజరు కావాల్సి ఉండగా.. కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు దండు సారయ్య, పింగళి అనూహ్య, పాబోలు స్వాతి హాజరయ్యారు. వారితో ఆర్డీవో ప్రమాణస్వీకారం చేయించారు. హైదరాబాద్ క్యాంపునకు వెళ్లిన 19 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు. నిర్ణీత సమయం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు సమావేశ మందిరానికి వారు హాజరు కానందున ఛైర్మన్ వైస్ ఛైర్మన్, ఇతర కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఆర్డీవో ప్రకటించారు
