
నిర్మల్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ఏకగ్రీవం
ది లీడర్స్ డైరీ: నిర్మల్ మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తైంది. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నియమించిన అధికారిగా పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన 42 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశానికి జనరల్ అబ్జర్వర్ వీరారెడ్డి హాజరయ్యారు. కోరం పూర్తి కావడంతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించారు.
చైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య ఎన్నికయ్యారు. ప్రతిపాదకుడిగా కత్తి నరేందర్, బలపరిచిన వారిగా ఎం.డి. ఇమాన్ ఉల్లా ఉన్నారు.
వైస్ చైర్‌పర్సన్‌గా అప్పాల గణేష్ చక్రవర్తి ఎన్నికయ్యారు. ప్రతిపాదకుడిగా తాజ్ అద్దీన్, బలపరిచిన వారిగా గొల్లా గోపినాథ్ ఉన్నారు.
ప్రత్యేక అధికారి ఎన్నిక ఫలితాలను అధికారికంగా ప్రకటించి సమావేశాన్ని ముగించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డి.ఈ. హరి భువన్, తాహసిల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
