
దుర్గా నామస్మరణతో మార్మోగిన ఏడుపాయల
దుర్గమ్మను దర్శించుకున్న జిల్లా అదనపు కలెక్టర్,ఎస్పీ నగేష్ ,మహేందర్
తెలంగాణాలో ప్రసిద్ధి గాంచిన శ్రీఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మాఘ అమావాస్య పర్వదినం సందర్భంగా ఆదివారం మాఘ ఉత్సవాలను ఆలయ ఈఓ చంద్రశేఖర్ ప్రారంభించారు.
అనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థ ప్రసాదాలు అందజేశారు.భక్తులు స్నానాలాచరించేందుకు కర్ణాటక,మహారాష్ట్ర,తమిళనాడు,హైదరాబాద్,తదితర ప్రాంతాలకు చెందిన దాదాపుగా లక్షలాదిగా భక్తులు వివిధ వాహనాలలో తరలి వచ్చి మంజీరాలో పుణ్యస్నానాలా చరించారు. ఏడుపాయల మంజీరాలో పుణ్య స్నానాలచరిస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దుర్గాదేవి గర్భాలయంలో వేకువ జామునే ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అతిసుందరంగా
ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు,మంగళ హారతి,పంచామృతాలు,విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.క్యూ లైన్ లలో భక్తులు గంటల తరబడి నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. మరికొందరు అమ్మవారికి భక్తులు ఓడి బియ్యం,తల నీలాలుసమర్పించారు. సంతానం లేని భక్తులు సంతాన గుండంలో స్నానాలాచరిస్తూ తమతమ మొక్కలు చెల్లించుకున్నారు. మరి కొంత మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు.బోనాల ముందు డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేశారు.
మఘా స్నానాలు ఆచరించడానికి నాలుగు చక్రాల వాహన దారులకు తిప్పలు తప్పలేదు. అమ్మవారి సన్నిధిలోనీ మంజీరా నది పాయలలో మాఘ స్నానాలు ఆచరించడానికి వెళితే వాహనాలను పార్కింగ్ స్థలం నుండి కిలోమీటర్ మేర నిలుపుదల చేసి కాలినడక ఆలయానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.నాలుగు చక్రాల వాహనాలు ఆలయ పరిసర ప్రాంతాల్లోకి అనుమతి ఇస్తే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించిన పోలీసులు నాగ్సాన్ పల్లి వైపు చెలిమెల కుంట వైపు పోతన్ శెట్టి పల్లి వైపు నుండి ఏడుపాయలకు విచ్చేసి భక్తులకు రెండవ బ్రిడ్జి సమీపంలో వాహనాలను నిలుపుదల చేసేందుకు పార్కింగ్ ఏర్పాటు చేశారు.కానీ వాహనాలు నిలుపుదల చేసిన భక్తులకు పోతన్ శెట్టి పల్లి రెండవ బ్రిడ్జి వద్ద ఆటోను ఏర్పాటు చేసి కమాన్ నుండి వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిఉంది కానీ సంబంధిత అధికారులు గానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరించడంతో కమాన్ నుండి వచ్చినవాహనదారులు కాలినడకనే శరణ్యం అయ్యింది.అసలే భానుడి ప్రతాపానికి ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో కాలినడకన వచ్చిన భక్తులు త్రాగు నీటి వసతులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు.
ప్రత్యేక దర్శనం కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు దర్శనం టికెట్ ధరను ఇష్టారీతిన పెంచడంతో అమ్మవారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు షట
గోపం పెట్టారు.ప్రతి రోజు ప్రత్యేక దర్శనం టికెట్ ధర 100రూపాయలు కాగా ఉస్తవాల సందర్భంగా రూ.250,రూ.500 రూపాయల ప్రత్యేక దర్శనాలు పెట్టీ 500 దర్శనం వారికి ఆలయం ముందు ఆశీర్వచనంతోపాటు ఓ రూ.20రూపాయల కండువాను కప్పి చేతిలో ఓ లడ్డును పెట్టీ భక్తుల భక్తిని సొమ్ము చేసుకున్నారు. అయితే మాఘ స్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని గ్రహించిన ఆలయ ఈఓ చంద్రశేఖర్ ప్రత్యేక దర్శనం పేరున దర్శనాల టికెట్ ల ధరలు అమాంతం 100,250,500రూపాయలకు పెంచి భక్తుల భక్తికి షట గోపం పెట్టారు.మాఘ అమావాస్య ను పురస్కరించుకొని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్,ఎస్పీ మెంచు నగేష్,మహేందర్ ఆర్డీఓ రమాదేవిలు దర్శించుకున్నారు.ఆదివారం ఉదయం ఏడుపాయలకు చేరుకోగా ఆలయ ఈఓ చంద్రశేఖర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.వీరికి ఆలయ ఇఓ చంద్రశేఖర్ శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మాఘ స్నానాల ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఇఓ చంద్రశేఖర్ సూచించారు.

పనిచేయని షవర్లు నడవవు…. జల్లు స్నానాలకు ఇబ్బందులు
మాఘ స్నానాల కోసం ఏర్పాటు చేసిన షవర్ బాత్ లు ఉత్చావ విగ్రహాలను తలపించాయి.ఆలయ పరిసర ప్రాంత పాయ వద్ద జల్లు స్నానాల షవర్ బాత్ ఏర్పాటు చేయకపోవడంతో ఆలయం వద్ద స్నానాలు ఆచరించడానికి ఇబ్బందులు పడ్డారు.చెక్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన షవర్ బాత్ లు పనిచేస్తున్నాయి తప్ప ఘనపూర్ ఆనకట్ట వద్ద, మొదటి బ్రిడ్జి వద్ద గల షవర్ బాత్ లు పనిచేయడం లేదు. దీంతో మహిళలు,చిన్న పిల్లలు స్నానాలు ఆచరించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నిర్లక్ష్యానికి నిదర్శనం విద్యుత్ బోర్డు
మాఘ స్నానాల జాతర కోసం ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా బోర్డులు అభద్రత తో వదిలి వేయడం మూలంగా విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఆలయ గర్భగుడి ప్రక్కన గల ప్రత్యేక దర్శన క్యూ లైన్ వద్ద ఆలయానికి విద్యుత్ సరఫరా కోసం ఓ బోర్డును ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా కనెక్షన్ ఇచ్చి బోర్డుకు తలుపు బిగించక వదిలి వేయడం మూలంగా విద్యుత్ వైర్లు యమపాషాల్లా దర్శనమిచ్చాయి.ప్రత్యేక దర్శనం కోసం వచ్చే భక్తుల దృష్టి మరలిందా ప్రమాదం సంభవించే విధంగా దర్శనమిచ్చాయి.అమ్మవారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అధికారి ఏర్పాట్లపై నిర్లక్షం వహించడం మూలంగా ఏర్పాట్లపై భక్తులు తీవ్ర విమర్శలు చేశారు.
