ది లీడర్స్ డైరీ, ఆసిఫాబాద్ : సర్పంచుల విధులు బాధ్యతలపై శిక్షణ ఇప్పించేలా అధికారులు ఈనెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు మూడు విడతల్లో శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ ప్రకటించారు.కాగజ్ నగర్ లోని మైనారిటీ గురుకులంలో తరగతులను నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.8 మంది మాస్టర్ ట్రైనర్లు సర్పంచ్ లకు శిక్షణ ఇవ్వనున్నారు.
జిల్లా లోని 335 పంచాయతీలకు గాను 332 సర్పంచులు గెలుపొందారు. వీరిని ఆరు బృందాలుగా విభజించి మూడు విడతల్లో ఒక్కో బృందానికి ఐదు రోజులపాటు పంచాయతీరాజ్ చట్టం పాలనపరమైన వివిధ అంశాలపై వారికి శిక్షణ ఉంటుంది. భోజనం,బస ఇలా వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజు ఉదయం9: 30 నుండి సాయంత్రం 6:30 వరకు తరగతులు ఉంటాయి.
ఏయే అంశాల్లో శిక్షణ అంటే…
తెలంగాణ పంచాయతీ రాజ్ 2018 ప్రకారం పంచాయతీ అధికారులు సర్పంచులు, ఉపసర్పంచులు,వార్డు సభ్యుల విధులు బాధ్యతల గురించి వివరిస్తారు. నాయకత్వ లక్షణాలు, ఒత్తిడి అనుగమించడం, ఆదర్శ గ్రామం, పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, ఉత్తమ పద్ధతులు, పారిశుద్ధ్య నిర్వహణ,బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం, ఘన ద్రవ వ్యర్ధాల నిర్వహణ,కేంద్ర,రాష్ట్ర పథకాలు, పంచాయతీ సమావేశాలు, గ్రామసభ, స్టాండింగ్ కమిటీలు, ఇతర కమిటీలు,దస్రాల నిర్వహణ, ఉపాధి పనులు, వనమహోత్సవం, లే అవుట్లు, భవనాల అనుమతులు, అభివృద్ధి లక్ష్యాలు, పంచాయితీలు వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవడం, ఆర్థిక వ్యయ నిర్వహణ,తాగునీరు,వీధి దీపాలు, ఈ పంచాయతీ, జణన, మరణ,వివాహ రిజిస్ట్రేషన్లు ఇలా అంశాలపై అవగాహన కల్పిస్తారు. త్వరలో మండల స్థాయిలో ఉపసర్పంచులు,వార్డు సభ్యులకు విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి మాట్లాడుతూ..
సర్పంచులకు పాలనాపరమైన అంశాలపై శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు సిద్ధం చేశామని,శిక్షకులు చెప్పిన అంశాలను నమోదు చేసుకొని పల్లెల అభివృద్ధికి,ప్రజల సుపరిపాలన అందించేలా చూడాలని సూచించారు.
