Headlinesనేటి నుంచి సర్పంచులకు శిక్షణ

నేటి నుంచి సర్పంచులకు శిక్షణ

Link Copied!

నేటి నుంచి సర్పంచులకు శిక్షణ
రెండు విడతలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
ది లీడర్స్ డైరీ: గ్రామ పంచాయితీల్లో చేపట్టాల్సిన పనులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, నిధులు, ఖర్చు, ప్రజలకు అందాల్సిన సేవలు, పన్నుల వసూళ్లు, సర్పంచి విధులు, బాధ్యతతో పాటు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 లోని అంశాల పై ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు సోమవారం నుంచి అవగాహన కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పంచాయతీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎర్రవల్లిలోని బెటాలియన్ లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వారికి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, బస చేసేందుకు అవసరమైన సౌకర్యాలు ఇక్కడే కల్పించారు. ప్రతి సర్పంచ్ కి గుర్తింపు కార్డులు అందించారు.
తొలి విడతలో 156 మంది*
జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో మొత్తం 255 గ్రామ పంచాయితీలకు సర్పంచులు ఎన్నికయ్యారు. ఇందులో 127 మంది మహిళలు, 128 మంది పురుషులు ఉన్నారు. ఐదు రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికీ ఎనిమిది మంది అధికారులకు హైదరాబాదులో శిక్షణ ఇవ్వగా, వీరంతా ఇక్కడ అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఏడు మండలాల్లో నీ 156 సర్పంచులకు, అలాగే రెండో విడత ఫిబ్రవరి 2 వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 6 మండలాల్లోని 99 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
మొదటి విడత
గద్వాల 28, కేటి దొడ్డి 23, మల్దకల్ 25, గట్టు 27, థరూర్ 28, వడ్డేపల్లి 10, ఉండవల్లి 15.
రెండవ విడత
అయిజ 28, ఇటిక్యాల 14, రాజోలి 11, మానవపాడు 17, అలంపూర్ 14, ఎర్రవల్లి 15.

తాజా వార్తలు

Related Articles