Headlinesపారదర్శకంగా మున్సిపల్ వార్డు రిజర్వేషన్లు

పారదర్శకంగా మున్సిపల్ వార్డు రిజర్వేషన్లు

Link Copied!

 

పారదర్శకంగా మున్సిపల్ వార్డు రిజర్వేషన్లు

జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ది లీడర్స్ డైరీ :: రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని మున్సిపాలిటీల వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు.
శనివారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ ఖరారు ప్రక్రియను కలెక్టర్ పారదర్శకంగా నిర్వహించారు.
భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు, ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12వార్డులు, చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20వార్డులు, పోచంపల్లి మున్సిపాలిటీలో 13వార్డులు, మోత్కూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు రిజర్వేషన్ కేటాయింపులు పూర్తయ్యాయని తెలిపారు.
మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్‌ను నిబంధనల ప్రకారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ విధానంలో కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకే ఈ ప్రక్రియ జరిగిందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీవోలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles