వరంగల్ జిల్లా, గీసుకొండ మండలం, మరియపురం సర్పంచి తిరుమలరెడ్డి అర్పిత రెడ్డి ఒకవైపు సర్పంచిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అర్పితా రెడ్డి బీకాం, బీఈడీ చదివారు. గతంలో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే సర్పంచ్ గా ఎన్నికయ్యారు గ్రామ పాలన చేస్తూనే పంచాయతీ కార్యాలయంలో చిన్నారులకు ట్యూషన్ చెప్తున్నారు.
ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు 40 మంది విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తున్నారు. అంతేకాక ఆమె ప్రతినెల ఒక్కో విద్యార్థికి పెన్నులు, పెన్సిల్లు, పాత పుస్తకాల కోసం రూ.116 చొప్పున అందజేస్తున్నారు అర్పిత రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందిన మరియపురాన్ని మరింత ఆదర్శంగా నిలిపేందుకు విద్యార్థులకు ఉచితంగా విద్య బోధన చేస్తున్నానని, తనకు ప్రభుత్వం అందించే గౌరవేతనాన్ని కూడా విద్యార్థుల కోసమే వెచ్చిస్తాను అన్నారు.
