Headlinesఎన్నికలకు మేం సిద్ధం

ఎన్నికలకు మేం సిద్ధం

Link Copied!

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేక రాసిన పురపాలక శాఖ
*నేడు నోటిఫికేషన్!
పట్టణ స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన తాము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చెబుతూ పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేక రాశారు. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే దాంతో పురపాలక శాఖ ఏర్పాట్లు ముంబరం చేసింది ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపాదిక రిజర్వేషన్లకు కూడా ప్రకటించింది. పురపాలక శాఖ వైపు నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని పనులు పూర్తి కావడంతో ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడమే తరువాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం. మంగళవారం నోటిఫికేషన్ విడుదలవుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 17 లోపు మున్సిపాలిటీలు, ఏమైంది కార్పోరేషన్ల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ గ్రామంలో ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. అవసరమైన సిబ్బంది, ఎన్నికల సామాగ్రి భద్రత ఏర్పాట్లు వంటి వాటిపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది మరోపక్క రాష్ట్రంలోని మునిసిపాలిటీ లు , కార్పొరేషన్లలో ఎన్నికల సందడి మొదలైంది.

తాజా వార్తలు

Related Articles