
జిల్లాలో మున్సిపాలిటీ వార్డులు మహిళా రిజర్వేషన్లు ఖరారు:జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ది లీడర్స్ డైరీ:శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోమహిళ రిజర్వేషన్ ఖరారు ప్రక్రియని పారదర్శకంగానిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్
జిల్లాలోని మెదక్ మున్సిపాలిటీలోని 32 వార్డు లు,నర్సాపూర్ మున్సిపాలిటీ లోని 15 వార్డు లు,తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులకు,రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు మహిళ
రిజర్వేషన్ ఖరారులో భాగం గా మున్సిపాలిటీలకు సంబందించి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ బీసీల డెడికేషన్ కమిషన్ ప్రకారం, ఎస్సీ,ఎస్టీలది 2011 జనాభ లెక్కల ప్రకారం, మహిళ రిజర్వేషన్ ను జీవో 9 ప్రకారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్ కేటాయింపులు చేశామని ఈసందర్బంగా కలెక్టర్ స్పష్టం చేసారు.
ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ ,ప్రత్యేక అధికారి సంధ్య,ఆర్డీవోలు , మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
