
మహిళా రిజర్వేషన్లను గౌరవించాలి,కార్పొరేషన్ లో గెలిచిన
మహిళలకు స్వేచ్ఛనివ్వాలి – పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకురాలు లక్ష్మి
ది లీడర్స్ డైరీ:రామగుండం కార్పొరేషన్ లో మహిళా కార్పొరేటర్లకు అభినందనలు తెలుపుతూ సోదరీమణులంతా రాజ్యాధికారంలో సమాన భాగాన్ని పొందేందుకు ముందు వరుసలో నిలవాలని
పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్లో గెలుపొందిన స్థానాల్లో వారి కుటుంబ సభ్యుల ఆర్భాటం పెత్తనం ఉండకుండా స్వేచ్ఛని ఇవ్వాలని లక్ష్మి అన్నారు. మహిళా రిజర్వేషన్లు గెలిచిన కార్పొరేటర్లను కేవలం సంతకాలకే పరిమితం చేయకుండా, పరిపాలన రంగంలో వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు మున్సిపల్ చట్టాల పరిధిలో మహిళా కార్పొరేటర్లు తమ విధులను సజావుగా సాగేందుకు కుటుంబ సభ్యులు స్వేచ్ఛనివ్వాలని అన్నారు. 2019 వంటి చట్టాల ప్రకారం అధికారిక విధుల్లో బయటి వ్యక్తులు కుటుంబ సభ్యులు జోక్యం ఉంటే సదరు కార్పొరేటర్ పదవిని కోల్పోయే ప్రమాదం ఉన్నదనే విషయాన్ని అందరూ గుర్తించాలని లక్ష్మి అన్నారు. ఈ విషయాలపై మున్సిపల్ నూతన పాలకవర్గం దృష్టి సారించాలని మహిళలకు స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహించాలని పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మీ కోరారు.
