ఆ రెండు జీపీలకు ఎన్నికలు లేనట్లే!

👤 BIO-DATA

Full Name ఆ రెండు జీపీలకు ఎన్నికలు లేనట్లే!

ప్రభుత్వ అధికారుల తప్పిదం.. పట్టింపులేని తనంతో ఆ రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోనున్నాయి. గతంలో నెల్కి వెంకటాపూర్‌లోనున్న వందుర్‌గూడను విడదీసి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నెల్కి వెంకటాపూర్‌లో అసలు గిరిజనులు లేకున్నా సర్పంచ్‌తో పాటు ఐదు వార్డు స్థానాలను ఎస్టీలకు రిజర్వ్‌ చేయగా, ఇక్కడ ఎన్నికలు నిలిచిపోనున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాము కలిసే ఉంటామని, తమ గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఎన్నికలు వద్దం టూ వందుర్‌గూడ వాసులు తెగేసి చెబుతున్నారు. ఈ విషయమై ఆందోళనలు చేపడుతున్నా స్పందించే వారే కరువయ్యారని, ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Related Articles