Headlinesగుడిపల్లి సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దసరా కానుకగా నూతన వస్త్రాల పంపిణీ

గుడిపల్లి సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దసరా కానుకగా నూతన వస్త్రాల పంపిణీ

Link Copied!

గుడిపల్లి: దసరా పండుగను పురస్కరించుకుని గుడిపల్లి గ్రామ సర్పంచ్ కున్‌రెడ్డి రాజశేఖర్ రెడ్డి గ్రామపంచాయతీ పరిధిలోని 10 మంది వార్డు సభ్యులతో పాటు ఉపసర్పంచ్, గ్రామ కార్యదర్శి, పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను పండుగ కానుకగా అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. “అందరూ బాగుండాలి.. అందరితో నేను ఉండాలి” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పరస్పర సహకారంతో ముందుకు సాగుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కానుకలను అందించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి విజయ్ రెడ్డి, ఉపసర్పంచ్ అరవపల్లి శ్రీనయ్య, వార్డు సభ్యులు ఎర్ర మహేశ్వరి, కత్తుల రమేష్, గోలి స్వామి, దారం సైదమ్మ, బోడ నాగరాజు, ఎర్ర వంశీకృష్ణ, గణపురం రాధిక, వట్టేపు శ్రీను, వడ్లపల్లి శ్రావణ్య పాల్గొన్నారు.

అలాగే గ్రామపంచాయతీ సిబ్బంది గోలి ఈశ్వర్, వడ్లపల్లి వెంకటరెడ్డి, భూతం యాదయ్య, కొమ్ము దుర్గయ్య, ఎర్ర వెంకటయ్య, బోడ వెంకటయ్య, గణపురం ముత్యాలు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles