Headlinesరాష్ట్రంలోనే తొలిసారి.. గద్వాల జిల్లాలో ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు!

రాష్ట్రంలోనే తొలిసారి.. గద్వాల జిల్లాలో ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు!

Link Copied!

గద్వాల: కొత్త జీవో అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే తొలిసారిగా గద్వాల జిల్లాలో ఉప సర్పంచ్ చెక్ పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సమాచారం.

మాన్రెదొడ్డి గ్రామ ఉప సర్పంచ్ భీమన్న చెక్ పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు డీపీవో శ్రీకాంత్ తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులపై ఉప సర్పంచ్ సంతకాలు చేయడం లేదని గ్రామ సర్పంచ్ సుజాత ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు చెక్ పవర్‌కు సంబంధించిన బాధ్యతలను రాజోలి ఎంపీడీవోకు అప్పగించినట్లు తెలిపారు.
కొత్త జీవో అనంతరం జిల్లాలో ఈతరహా చర్య తొలిసారి కావడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం ఇతర గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ చెక్ పవర్‌కు సంబంధించిన అంశాలపై కూడా ఆసక్తిని పెంచింది.

ప్రభుత్వ తాజా మార్గదర్శకాల వివరాలు:

సంతకానికి గడువు: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల చెక్కులపై ఉపసర్పంచ్ 7 రోజుల్లోపు సంతకం చేయాలి.ఉద్దేశపూర్వక జాప్యం: సరైన కారణం లేకుండా వారానికి మించి చెక్కులను పెండింగ్‌లో పెడితే జిల్లా కలెక్టర్ విచారణ చేపడతారు.చెక్ పవర్ తొలగింపు: విచారణలో ఉపసర్పంచ్ కావాలనే అడ్డుకుంటున్నట్లు తేలితే, వారి జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేసి ఆ అధికారాన్ని పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ లేదా ఎంపీడీవోకు అప్పగిస్తారు.అభ్యంతరాలు: ఉపసర్పంచ్‌కు తమ అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుంది, కానీ కేవలం వ్యక్తిగత విభేదాలతో గ్రామాభివృద్ధిని స్తంభింపజేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తాజా వార్తలు

Related Articles