
చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ , మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శాసనమండలి భవనాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాలు అనంతరం డాక్టర్ డాక్టర్ బండ ప్రకాష్ ని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ స్థానంలో శాస్తోరంగ కుర్చోపెట్టిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు శాసన మండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహ చార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర రావు , జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , పొన్నం ప్రభాకర్ , వివేక్ వెంకటస్వామి , మహమ్మద్ అజహరుద్దీన్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మండలిలో ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవంత్ రెడ్డి పూజ నిర్వహించారు.
