Headlinesరేషన్ డీలర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం:ఆర్డిఓ వేణు మాధవరావు

రేషన్ డీలర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం:ఆర్డిఓ వేణు మాధవరావు

Link Copied!

సూర్యాపేట డివిజన్‌లోని 8 మండలాల్లో ఖాళీగా ఉన్న 15 రిజిస్ట్రేషన్ షాప్ డీలర్ల నియామకంకోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని,అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్ రావు తెలిపారు.

సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్ రావు గురువారం విలేకరులతో మాట్లాడుతూ…


ఆత్మకూర్ (ఎస్)మండలంలో (2) గట్టకల్ ,శెట్టిగూడెం, చివ్వెంల మడలంలో (2) చందుపట్ల 2,వాల్యా తండ,మోతే మండలంలో (2) నరసింహపురం, తుమ్మగూడెం, నాగారం మండలంలో (1) వర్ధమానుకోట, నూతనకల్ మండలంలో (1) ఎడవల్లి, సూర్యాపేట మండలంలో (2) సూర్యపేట మండలం ఇమాంపేట, తాళఖమ్మం పాడు, తిరుమలగిరి మండలంలో (2) మాలిపురం, రావులపల్లి గ్రామాల్లో డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు.

ఆయా గ్రామాల్లో స్థానికులు, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి, 18 నుంచి 40 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు తమ కుల దృవీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈనెల 16 నుండి ఏప్రిల్ 14 వరకు సమీప తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు సమీప తహసిల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

తాజా వార్తలు

Related Articles