Headlinesజీ-రామ్‌జీ (G-RAMJI) పథకం కింద తెలంగాణకు తొలి విడతగా ₹1,263.41 కోట్లు విడుదల

జీ-రామ్‌జీ (G-RAMJI) పథకం కింద తెలంగాణకు తొలి విడతగా ₹1,263.41 కోట్లు విడుదల

Link Copied!

కొత్తగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (VB-G RAM-G) పథకం కింద కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా తెలంగాణకు రూ.1,263.41 కోట్లను విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న జీ-రామ్‌జీ (G-RAMJI) పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ₹3,825.31 కోట్లు కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ తెలిపారు. ఇందులో తొలి విడతగా ₹1,263.41 కోట్లు విడుదల చేసినట్లు ఆయన మంగళవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా వెల్లడించారు.

అదేవిధంగా, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (PMGSY) పథకం కింద 2026–27 సంవత్సరంలో తెలంగాణలో 1,193 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించినట్లు మంత్రి తెలిపారు.

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, గ్రామాల అనుసంధానం మరియు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఈ నిధులు కీలకంగా ఉపయోగపడనున్నాయి.

తాజా వార్తలు

Related Articles