Headlinesగుడిపల్లి గ్రామపంచాయతీలో విజయవంతంగా తెలంగాణ జలసిరి–జలసంచయ్ గ్రామసభ

గుడిపల్లి గ్రామపంచాయతీలో విజయవంతంగా తెలంగాణ జలసిరి–జలసంచయ్ గ్రామసభ

Link Copied!

గుడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ జలసిరి–జలసంచయ్ కార్యక్రమంపై గ్రామసభను విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కున్‌రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ, తాగునీటి సమస్యల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై గ్రామసభలో సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో నీటి సంరక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ గ్రామసభలో గ్రామానికి చెందిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సెక్రటరీ విజయ్ రెడ్డి, ఉప సర్పంచ్ అర్వపల్లి శ్రీనయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తాజా వార్తలు

Related Articles