Headlinesరేషన్ డీలర్‌ను సస్పెండ్ చేయాలని గుడిపల్లి సర్పంచ్ డిమాండ్

రేషన్ డీలర్‌ను సస్పెండ్ చేయాలని గుడిపల్లి సర్పంచ్ డిమాండ్

Link Copied!

నల్గొండ జిల్లా ఆగస్టు14:గుడిపల్లి మండలంలోని చిలకమర్రి గ్రామపంచాయతీ రేషన్ షాప్ నంబర్‌–1 డీలర్‌గా విధులు నిర్వహిస్తున్న కొర్ర బాలకృష్ణ చౌహాన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని గ్రామ సర్పంచ్ అశ్విని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బాలకృష్ణ చౌహాన్ గుడిపల్లి మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతూ రేషన్ డీలర్‌గా విధులు నిర్వహిస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు. పార్టీ పదవిలో కొనసాగుతూ రేషన్ డీలర్‌గా విధులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఈ విషయంపై తక్షణమే విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం గుడిపల్లి మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎల్గురి వల్లపు రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మునగాల అంజిరెడ్డి, సర్పంచ్ కున్‌రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నాయకులు అర్వపల్లి నర్సింహ, తోటకూరి పరమేశ్, ఎర్ర యాదగిరి, బోడ నాగరాజు, కత్తుల రమేష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles