Headlinesనల్లగొండ జిల్లా కలెక్టర్‌కు సర్పంచుల వినతిపత్రం

నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు సర్పంచుల వినతిపత్రం

Link Copied!

జాయింట్ చెక్ పవర్ విధానాన్ని రద్దు చేసి.. సర్పంచ్‌కు ఏకైక చెక్ పవర్ కల్పించాలి

నల్లగొండ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారికి సర్పంచుల తరఫున వినతిపత్రం సమర్పించారు.రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన జాయింట్ చెక్ పవర్ విధానాన్ని రద్దు చేసి, ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నికైన సర్పంచ్‌కు ఏకైక చెక్ పవర్ కల్పించాలి అనే ప్రధాన డిమాండ్‌తో వినతిపత్రాన్ని అందజేశారు.

గ్రామ పంచాయతీల సజావు నిర్వహణ, గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సర్పంచ్‌లకు తగిన అధికారాలు, ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సర్పంచులు చిరంజీవి చాట్ల చిత్రియాల, కందకట్ల రజనీ యాదవ్ రెడ్డి,తిరుమలగిరి సాగర్ మండలం, కొంపల్లి సర్పంచ్ సాలమ్మ రవీందర్, రంగుండ్ల గోపాల్ నాయక్, యల్లాపురం సర్పంచ్ రాజు, సుంకిశాల సర్పంచ్ సరోజ కిషన్, నేనావత్ భీముడు సర్పంచ్, వెంకట్ తాండ, జీపీ దేవరకొండ, రమావత్ లక్ష్మన్ నాయక్,పాల్తి శంకర్ నాయక్, పాల్తి తండ సర్పంచ్,రామావత్ బాబు నాయక్, నిమ నాయక్ తండ సర్పంచ్,రామావత్ హేమ్లా నాయక్, కుక్కుడు చెట్టు తండ రామావత్ శ్రీను నాయక్,జయరాం తండ సర్పంచ్ రామావత్ రూప్ సింగ్ పర్వేదుల సర్పంచ్ పెద్దవూర మండలం,పల్లె వెంకటేష్ గౌడ్
తదితరులు పాల్గొన్నారు.

జాయింట్ చెక్ పవర్ రద్దు చేసి, ప్రజలచే ఎన్నికైన సర్పంచ్‌కు ఏకైక చెక్ పవర్ కల్పించాలనే డిమాండ్‌కు వారు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.

తాజా వార్తలు

Related Articles