Headlinesఉదయం 9 లోపు గ్రామపంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదు చేయాలి

ఉదయం 9 లోపు గ్రామపంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదు చేయాలి

Link Copied!

పీఆర్‌ అండ్‌ ఆర్డీ కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌ ఆదేశాలు

హైదరాబాద్‌: గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు మొబైల్‌ యాప్‌లో హాజరు నమోదు చేసి, అనంతరం గ్రామాల్లో తమ విధులను నిర్వహించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌ ఆదేశించారు.ఒకటి కంటే ఎక్కువ గ్రామపంచాయతీలకు ఇన్‌చార్జి/అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యదర్శులు తమ ఒరిజినల్‌ పోస్టింగ్‌ గ్రామపంచాయతీలోనే ఉదయం 9 గంటలలోపు హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు.హాజరు నమోదు విషయంలో ఉదయం 9 గంటల గడువును కచ్చితంగా పాటించాలని సూచించారు. అయితే డీఎస్‌ఆర్‌ను రోజులో ఏ సమయంలోనైనా సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను గ్రామపంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారులు తెలియజేయాలని కమిషనర్‌ సూచించారు.

ఈ మేరకు డీపీవోలకు కమిషనర్‌ లేఖ జారీ చేశారు. లేఖ ప్రతులను జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, కమిషనరేట్‌ కార్యాలయ అధికారులకు పంపించారు.16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాలు.కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కోసం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ప్రత్యేకంగా సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలు తెరవాలని పీఆర్‌ కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌ ఆదేశించారు.

హైదరాబాద్‌, మేడ్చల్‌–మల్కాజిగిరి అర్బన్‌ జిల్లాలను మినహాయించి, సంబంధిత జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామపంచాయతీలకు విడివిడిగా జీరో బ్యాలెన్స్‌ బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది.స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలు ఖాతాలు తెరవాలి.యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కామారెడ్డి, నిజామాబాద్‌, హనుమకొండ, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌ జిల్లాలు ఖాతాలు తెరవాలని సూచించారు.

పైన పేర్కొన్న జిల్లాల్లోని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామపంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కోసం ప్రత్యేక జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలు తెరిచేలా సంబంధిత జడ్పీ సీఈవోలు, డీపీవోలు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశించారు.ఈ మేరకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మెమో జారీ చేశారు.

తాజా వార్తలు

Related Articles