Headlinesగ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట

Link Copied!

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట

మైసిగండి సర్పంచ్ ప్రేమ జవాహర్ లాల్ నాయక్

రూ.5 లక్షలతో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన

ది లీడర్స్ డైరీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని మైసిగండి సర్పంచ్ ప్రేమ జవాహర్ బాబా నాయక్ అన్నారు. మంగళవారం మైసిగండి గ్రామంలోని జర్పుల గుడి నుంచి వద్యావత్ లచ్చు ఇంటి వరకు రూ.5 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఉపసర్పంచ్ హీరా సింగ్ నాయక్, వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో టీపీసీసీ సభ్యులు అయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మైసిగండి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగా మంజూరైన రూ. లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు యమున రవి, శారదా సుమన్, బాబూలాల్, బన్నీ, కార్యదర్శి జంగయ్య మాజీ వార్డు సభ్యులు తులసి రామ్ నాయక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles