
ఉదయం 5 రకాల టిఫిన్లు
రెండు రోజులు మిల్లెట్ ఇడ్లీ.. మిగిలిన రోజుల్లో మిల్లెట్ ఉప్మా, దోసె, పూరి, బోండ…
ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఇదే మెనూ
ది లీడర్స్ డైరీ: వచ్చే విద్యా సంవత్సరం(2026-27) విద్యార్థులకు అమలు చేయనున్న ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం కింద 5 రకాల టిఫిన్లు అందించాలని పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. వారంలో ఆదివారం మినహా మిగి లిన ఆరు రోజులు ఉదయం అల్పాహారం, పాలు/రాగిజావ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయిం చింది. రెండు రోజులు మిల్లెట్ ఇడ్లీ, మిగిలిన నాలుగు రోజుల్లో మిల్లెట్ ఉప్మా, దోసె, బోండ, పూరి అందించాలని విద్యాశాఖ మెనూ రూపొందించింది. సోమవారం దోసెకు బదులు చపాతీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మాకు బదులు పొంగల్.. ఏది వీలైతే దాన్ని అందించేలా వెసులుబాటు కల్పించింది. పాఠ శాల విద్యార్థుల అల్పాహారానికి రూ.540 కోట్లు, పాలకోసం రూ.180 కోట్లు… మొత్తం రూ.720 కోట్లు ఖర్చ వుతుందని అంచనా వేయగా…ఆ మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. ఇంటర్ విద్యా ర్థుల కోసం రూ.56 కోట్లు కేటాయించారు. మొత్తం మీద దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. అల్పాహారం తినేందుకు విద్యార్థులకు 45 నిమిషాలు కేటాయించనున్నారు.
సోమవారం: దోసె చట్నీ/చపాతీ-కర్రీ
మంగళవారం: మిల్లెట్ ఇడ్లీ(రెండు)- సాంబారు
బుధవారం: పూరి(రెండు)- ఆలూ కుర్మా
గురువారం: మిల్లెట్ ఇడ్లీ(రెండు) – సాంబారు
శుక్రవారం: మిల్లెట్ ఉప్మా/పొంగల్- చట్నీ
శనివారం: బోండ(రెండు)- చట్నీ
(గమనిక: టిఫిన్తోపాటు ఒక రోజు పాలు, ఒకరోజు రాగి జావ అందిస్తారు. అంటే వారంలో 3 రోజులు పాలు, 3 రోజులు రాగిజావ అందు తుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఇదే మెనూ అమలవుతుంది.)
