
పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు సహకారం
ది లీడర్స్ డైరీ: పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు తమవంతు సహ కారం అందిస్తామని పెద్దవేడు గ్రామ సర్పంచ్ రాజసులోచన అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని పెద్దవేడు గ్రామానికి చెందిన యాదమ్మ, విష్ణు దంపతుల కుమార్తె పెండ్లికి సర్పంచ్ తనవంతు సహా యంగా పుస్తెమెట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ… గ్రామ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆడబిడ్డల పెండ్లిలకు పుస్తెమెట్టెలు అందజేయడం జరుగుతుందన్నారు. ఆడబి డ్డల పెండ్లిలు చేసేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దే శ్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.లక్షా సహాయం అందించి ఆదుకున్నారని తెలిపారు. అదే మాది రిగా తమవంతుగా గ్రామంలో ఆడబిడ్డల పెండ్లిలకు సహాయం చేస్తు న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, గ్రామస్తులున్నారు.
