Headlinesసర్పంచ్ల హక్కుల సాధనకై మరో ఉద్యమానికి సిద్ధం

సర్పంచ్ల హక్కుల సాధనకై మరో ఉద్యమానికి సిద్ధం

Link Copied!

సర్పంచ్ల హక్కుల సాధనకై మరో ఉద్యమానికి సిద్ధం

తెలంగాణా పంచాయితీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి

ది లీడర్స్ డైరీ : సర్పంచ్ హక్కుల సాధన కోసం అవసరమైతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలంగాణా పంచాయీతీ రాజ్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి పిలుపు నిచ్చారు.సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హరితా రిసార్ట్లో జిల్లాలోని సర్పంచ్లకు నిర్వహించిన చైతన్య సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగిస్తు కేంద్ర ప్రభుత్వం 73 వ రాజ్యాంగ సవరణ బిల్లును సవరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఐదంచెల విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎంఎల్సి ఎన్నికలలో సర్పంద్లకు ఎంపిటీసీల కు ఓటు హక్కు కలిపించాలని ఆయన కోరారు. ఆయా గ్రామ పంచాయితీలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీని విడుదల చేయాలని జిల్లాలో మైనింగ్ ద్వారా వచ్చే నిధిని ఆయా గ్రామ పంచాయితిలలో ఖర్చు చేసే అవకాశం కలిపించాలని ఆయన డిమాండ్ చేశారు, సర్పంచ్ల గౌరవ వేతనం 25 వేల రూపాయలకు పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా నిధులు గ్రామ పంచాయితీల ఖాతాలో జమ అయ్యేటట్లుగా సవరించాలని ఆయన కోరారు. ఉప సర్పంచ్లకు-సర్పంచ్ లతో జాయింట్ చెక్ పవర్ ను రద్దు చేయాలని సూచించారు. తాము సర్పంచ్ లం అందరి కంటే తక్కువ అన్న భావాన్ని విడనాడి గ్రామ ప్రథమ పౌరుడు గా సర్పంచ్ బాధ్యతా యుతంగా వ్యవహరిం చాలని సూచించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సంస్థ పనిచేస్తుందని ఆయన తెలిపారు. చురుకైన సమయం ఇచ్చే వారిని నూతన జిల్లా కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకుంటే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. నిరంతరం పోరాటం చేయటం ద్వారా సాధిం చలేనిది ఏమి లేదని అన్నారు. తమ సంస్థఏ రాజకీయపార్టీకి తొత్తు కాదని ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేఖం కాదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో 540 కోట్ల రూపా యల మైనింగ్ నిధి ఉందని ఈ లెక్కన ప్రతి గ్రామ పంచాయితికి దాదాపు కోటీ రూపాయలను వివిధ అభివృద్ధి సంక్షేమ కార్య క్రమాలకు ఖర్చు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం గ్రామ పంచాయితిలకు గుదిబండగా మారిన ఈ పంచాయితి ఆప్ ను వెంటనే. తొలగించాలని ఆయన సర్పంచ్ ల హర్శద్వానాల మధ్య ఆమోదించారు. తెలంగాణా ఎలాగైతే పోరాడి సాధించుకున్నామో అదే విధంగా వికారాబాద్ జిల్లా సర్పంచ్ స్పూర్తితో ఉద్యమించి హక్కులను సాదిం చుకుంటామన్న దీమాను ఆయన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా సర్పంచ్ లసంఘం అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతు చింపుల సత్యనారాయణ రెడ్డి చేపడుతున్న కార్యక్రమానికి ప్రతి సర్పంచ్ సహకరించా లని సూచించారు. సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతు సర్పంచ్ లంతా రాజకీయాలకు అతీతంగా ఏక తాటిపైకి వస్తే సాధించలేనిది ఏమి లేదని. ఏమిలేదని అన్నారు. ఆశోక్ రావు మాట్లాడుతు మైనింగ్ కు సంబందించిన ఖర్చు చేసే అవకాశం రంగారెడ్డి వికా రాబాద్ జిల్లాలకు మాత్రమే ఉందని అన్నారు. మందిపాల్ వెంకట్ వివిధ గ్రామాల సర్పంచ్లు అశోక్, మాజీ ఎంపిపి మల్లేషం, మధు సూధన్ గుప్తా, నాగరాజ్, అశోక్ రావు, మాణిక్యం,శాంతి, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆరంభించారు.జిల్లాలోని దాదాపు 200 మంది సర్పంచ్లు పాల్గొన్నారు

తాజా వార్తలు

Related Articles