Headlinesఎకో టౌన్ పేరిట చెత్తకుప్పలా గ్రామాలా.. 15 గ్రామాల ప్రజల ఆగ్రహ జ్వాలలు..

ఎకో టౌన్ పేరిట చెత్తకుప్పలా గ్రామాలా.. 15 గ్రామాల ప్రజల ఆగ్రహ జ్వాలలు..

Link Copied!

ఎకో టౌన్ పేరిట చెత్తకుప్పలా గ్రామాలా.. 15 గ్రామాల ప్రజల ఆగ్రహ జ్వాలలు..

ది లీడర్స్ డైరీ: అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ఎకో టౌన్కు వ్యతిరేకంగా 15 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. గువ్వలేటి ఎక్స్ రోడ్ నుంచి సద్దుపల్లి ఎక్స్ రోడ్ వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర భారీ పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న రావిరాల సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వేలాదిమంది గ్రామస్తులు, రైతులు, మహిళలు,  యువకులు పాల్గొని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. “గో బ్యాక్ ఎకో టౌన్”, “గ్రామాలను చెత్తకుప్పలుగా మార్చొద్దు”, “ప్రజల ప్రాణాలతో చెలగాటం నినాదాలతో ప్రాంతమంతా మార్మోగింది. ఎకో టౌన్ పేరుతో వాస్తవానికి హైదరాబాద్ నగర చెత్తను గ్రామాలపై రుద్దే కుట్ర జరుగుతోందని ప్రజలు మండిపడ్డారు. ఇప్పటికే మూసీ నది కాలుష్యంతో, క్రషర్ మిల్లుల ధూళి కాలుష్యంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో జీవో ముప్పు నెం.20 ద్వారా 494 ఎకరాల ప్రభుత్వ భూమిలో నగర వ్యర్థాలను తరలించి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యాన్ని బలి తీసుకునే నిర్ణయమని ఆరోపించారు. ఎకో టౌన్ ఏర్పాటుతో భూగర్భ జలాలు కలుషితమై వ్యవసాయం నాశనం అవుతుందని, పశుసంపదకు వాటిల్లుతుందని, భూముల విలువలు పడిపోతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నగర ప్రజల చెత్తను గ్రామాలపై మోపి గ్రామీణ ప్రజలను రెండో తరగతి పౌరులుగా చూడడం దారుణమని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలు, గ్రామసభల తీర్మానాలను పూర్తిగా పక్కనబెట్టి పక్కనబెట్టి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించిన గ్రామస్తులు, వెంటనే జీవో నెం.20ను రద్దు చేసి ఎకో టౌన్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. “ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గకపోతే గ్రామాలన్నింటినీ ఏకం చేసి మహా ఉద్యమం చేపడతాం. అవసరమైతే రహదారులు దిగ్బంధించి, ప్రజాప్రతినిధులను నిలదీసి, ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం” అని హెచ్చరించారు. ఎకో టౌన్ అంశం ఇప్పుడు అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ప్రజా వ్యతిరేక నిర్ణయంపై సాగుతున్న ఉద్యమంగా మారింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు తదితరులు హాజరయ్యారు.

తాజా వార్తలు

Related Articles