
బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి
ది లీడర్స్ డైరీ: బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని మహారాజ్పేట్ గ్రామ సర్పంచ్ వడ్ల సుజాత నరసింహ చారి అన్నారు. బడిబాట కార్యక్రమం లో భాగంగా గురువారం నాడు మహారాజుపేట గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామసర్పంచ్ హాజరై ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఉపాధ్యాయులు కూడా సకాలంలో పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నకృష్ణారెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్వేత, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
