పావని కుటుంబానికి అండగా నిలిచిన వెల్పూర్, ఆలూరు మండలసర్పంచులు

ది లీడర్స్ డైరీ : పావని కుటుంబానికి అండగా నిలిచిన వెల్పూర్, ఆలూరు మండల సర్పంచులు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వారి కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని పావని గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతు ఆ కుటుంబానికి ఆలూరు మండలంలోని గ్రామాల సర్పంచులు వారి కుటుంబానికి 50000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వారి మరణం గ్రామానికి తీరని లోటు అన్నారు.
కార్యక్రమం లో మిర్దపల్లి సర్పంచ్ యల్లా సాయిరెడ్డి, ఆలూరు సర్పంచ్ ముక్కెర విజయ్, దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి, గుత్ప సర్పంచ్ కొండ్ర కమల దశరథ్, మచ్చర్ల సర్పంచ్ కట్ట నర్సయ్య, డికంపల్లి సర్పంచ్ మచ్చర్ల చిన్నయ్య, కల్లడి సర్పంచ్ గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్, గగ్గుపల్లి సర్పంచ్ కొండి గంగాధర్, రాంచంద్రపల్లి సర్పంచ్ తోగార్ల భూషణ్, గుత్ప తాండ సర్పంచ్ కిషన్ నాయక్, క్యాంప్ సర్పంచ్ సుమన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ పావని కుటుంబానికి అండగా వెల్పూర్,ఆలూరు మండల సర్పంచులు

తాళ్ల రాంపూర్ సర్పంచ్ పావని కుటుంబానికి అండగా నిలిచిన వెల్పూర్,ఆలూరు మండల సర్పంచులు
ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారప్పు పావని కుటుంబాన్ని వేల్పూర్ మండలంలోని 18 గ్రామాల సర్పంచులు పరామర్శించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చిన వారు కష్టకాలంలో తమ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా వేల్పూర్ మండలంలోని సర్పంచులందరూ కలిసి ₹100,000 ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబానికి అవసరమైన ప్రతి విషయంలో తోడుగా నిలుస్తామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొని బెజ్జారప్పు పావనికి నివాళలు అర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు
