Headlinesరూ.5 వేల కోట్ల నిధులు పెండింగ్లోనే

రూ.5 వేల కోట్ల నిధులు పెండింగ్లోనే

Link Copied!

రూ.5 వేల కోట్ల నిధులు పెండింగ్లోనే

  • స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నుంచి నిలిచిన రూ.1,090 కోట్ల బకాయిలు
  • గ్రామీణ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లు రూ.2,979 కోట్లు పెండింగ్లోనే..
  • మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.1,200 కోట్లు
  • 16వ ఆర్థిక సంఘం నిధులు పొందేందుకు అడ్డస్తున్న కఠిన నిబంధనలు

ది లీడర్స్ డైరీ: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీలు, కార్పొరేషన్లు రూ.5,000 కోట్లకు పైగా నిధుల కొర తను ఎదుర్కొంటున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,090 కోట్ల బకాయి లు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు విడుదల చేయాల్సిన వాటా (మ్యాచింగ్ గ్రాంట్లు) రూ.2,979 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.1.200 కోట్లు ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సం స్థలకు ఒకవైపు భారీ నిధుల కేటాయింపులు జరిగినా, క్షేత్రస్థా యిలో నిధుల బదిలీ నెమ్మదిగా సాగుతోంది. మే 2028 లో కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్ధిక సంఘం కింద రాబోయే ఐదేళ్ల కాలా నికి (2026-31) గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.9,968 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ఏటా జాన్, అక్టోబర్ నెలల్లో రెం డు విడతలుగా విడుదల కావాల్సి ఉంది. అయితే, కేంద్రం విధించిన కఠినమైన ముందస్తు నిబంధనల వల్ల క్షేత్రస్థాయిలో నిధులు పూర్తిగా డ్రా చేసుకోవడం ఒక సవాలుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడం తో.. ఈ సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధుల్లో కేంద్రం ఒక్కపైసా విడుదల చేయలేదు. జెడ్పీ, ఎంపీపీల్లో పాలకవర్గాలు లేక…16వ ఆర్థిక సంఘం నిధులు తెలంగాణకు భారీగా మం జూరైనా, వాటిని పొందడంలో రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ సమస్యలు ఎదురవుతున్నాయి.

* కేంద్ర నిబంధనం ప్రకారం రాజ్యాంగంలోని పార్ట్ ఐగీ ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులు (పాలకవర్గాలు) ఉన్న స్థానిక సంస్థలకు మాత్రమే నిధులు నిరంతరాయం గా విడుదలవుతాయి.

తెలంగాణలో కొత్త సర్పంచ్లు వచ్చినా, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణలో ఆలస్యం కారణంగా కొన్ని నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది.

2026-27 మొదటి విడత నిధులు పొందాలంటే గత ఆర్థిక సంవత్సరం (20025-28)కి సంబంధించిన స్థానిక సంస్థల ఆడిట్ నివేదికలను తప్పనిసరిగా ఆన్లైన్లో సమర్పించాలి. రాష్ట్రంలో ఆడిటింగ్ ప్రక్రియలు అలస్యం కావడం నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది.

ప్రతి పైసా ఖర్చును ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్లో నమోదు చేయాలి. పంచాయతీ కార్యదర్శులు, అధికా రుల ‘మేకర్ అండ్ చెక్కర్’డిజిటల్ కీలు సరిగ్గా అప్డేట్ కాకపోవడం వల్ల ఆన్లైన్ పేమెంట్లు నిలిచిపోతున్నాయి.

16వ ఆర్థిక సంఘం నిధులను కేవలం మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యానికి మాత్రమే వాడాలని కేంద్రం నిబంధన పెట్టింది. దీనివల్ల పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్ల జీతాల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల ఎస్ఎఫ్సీపై అదనపు భారం మోయాల్సి వస్తోంది.

* స్థానిక సంస్థలు తన సొంత పన్నుల వసూళ్లను (ఆస్తివ న్నులు మొదలైనవి) పెంచుకుంటేనే అదనపు ప్రోత్సాహక (పనితీరు ఆధారిత 20%) నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

తాజా వార్తలు

Related Articles