
సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షునిగా బోయిని రాములు
» ప్రధాన కార్యదర్శిగా సామాని నాగిరెడ్డి
» సర్పంచుల సమస్యలు పరిష్కరిస్తాం
» తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్
ది లీడర్స్ డైరీ: సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షునిగా (మదారం,సర్పంచ్) బోయిని రాములును, ప్రధాన కార్యదర్శిగా సామాని నాగిరెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్ తెలిపారు. మంగళవారం అనంతగిరి హరిత రిసార్ట్లో జిల్లా సర్పంచుల సంఘం నూతనకమిటీని ఎన్నుకున్నారు. అదే విధంగా సంఘం ఉపాధ్యక్షులుగా ప్రమీల, యాదవరెడ్డి, దుబ్యా నాయక్, గౌరవ అధ్యక్షుడిగా చెంబాస్ కుమార్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా కరణం రాధ, లక్ష్మణ్ గౌడ్, శ్రీకాంత్, మశ్చందర్ రెడ్డి, కోశాధికారిగా రవీందర్ పవార్, గౌరవ సభ్యులుగా రవీందర్ నాయక్, మానెమ్మ. కె. అశోక్, వెంకటరామ్లడ్లు ఎంపికయ్యారు. ఈ సందర్భం గా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్ మాట్లాడుతూ… 73వ రాజ్యాంగ సవరణను పూర్తిస్థాయిలో అమలు చేసి గ్రామపంచాయతీలకు నేరుగా నిధులు మళ్లించాలని అన్నారు. సర్పంచుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ,వారికి ఆరోగ్య భద్రత కార్డు అందించడంతో పాటు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా, నెలకు రూ.25 వేల గౌరవ వేతనం చెల్లించాలని సూచించారు. మండల సమావేశాలకు హాజరయ్యే సర్పంచులకు 5. 1000 టిఏ ఇవ్వాలని, ప్రతి గ్రామపంచాయతీకి రూ.25 లక్షల ప్రత్యేక నిధులు నేరుగా విడుదల చేయాలని అన్నారు. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి, లబ్దిదారుల ఎంపిక సర్పంచుల సమక్షంలోనే జరగాలని కోరారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు సర్పంచుల ఆధ్వర్యంలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందరర్బంగా కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు బోయిని రాములు మాట్లాడుతూ…. సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డికి, రాష్ట్ర కార్యదర్శి మందిపాల్ వెంకట్ కి.జిల్లాలోని సర్పంచులకు ధన్యవాదాలు తెలియజేశారు.
