

99 రోజుల ప్రణాళికను అమలుపరచాలి
అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్
ది లీడర్స్ డైరీ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రజాపాలన- ప్రజాప్రగతి పాలన’ కార్యక్రమంలో భాగంగా 99 రోజుల ప్రణాళికను తప్పనిసరిగా అమలుపరచాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మోకిలా గ్రామంలోని డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, క్రిమిటోరియం, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 99 రోజుల ప్రణాళికను గ్రామాల్లో తప్పనిసరిగా అమలుపరచాలన్నారు. మార్చి నెలాఖరు వరకల్లా 100శాతం ఇంటి పన్నులను వసూలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ సురేష్ మోహన్, ఎంపీడీవో వెంకయ్య, డీఎల్ పేట సతీష్ రెడ్డి, మోకిలా గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్, డీఈ అర్థబ్ల్యూఎస్, హౌసింగ్ డీఈ, ఎంపీఓ గిరిరాజు, ఏపీవో నాగభూషణం, ఏపీఎం రవీందర్, గ్రామ కార్యదర్శి ఎల్లయ్య, తదితరులు ఉన్నారు..
