Headlinesనారాయణ ముదిరాజ్ మృతి పట్ల బండా ప్రకాష్ సంతాపం

నారాయణ ముదిరాజ్ మృతి పట్ల బండా ప్రకాష్ సంతాపం

Link Copied!

ది లీడర్స్ డైరీ: తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులుగా పనిచేసిన కోట్ల నారాయణ ముదిరాజ్ 13.04.2026 న కన్ను మూసారు. గతంలోకాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో క్రియాశీలకంగా వారు పనిచేశారు. కోట్ల నారాయణ ముదిరాజ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముదిరాజ్ సంఘంలో వివిధ హోదాలో పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం నుండి ముదిరాజులకు అండగా ఉంటూ అందరికీ మార్గదర్శకంగా ఉంటూ ముదిరాజుల మన్ననలు పొందారు . కోట్ల నారాయణ ముదిరాజ్ హైదరాబాద్ వాస్తవ్యులు.. 05.03.1943 న జన్మించినారు.
వారి మృతి పట్ల తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర, జిల్లా కార్యవర్గం తరపున డా. బండా ప్రకాష్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కోట్ల నారాయణ ముదిరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.

తాజా వార్తలు

Related Articles