
రూ.351 కోట్లతో భద్రాద్రి క్షేత్ర పునర్నిర్మాణం: సీఎం
ది లీడర్స్ డైరీ: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ రూపురేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తొలి దశలో రూ.351 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ నిధులతో రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, రూ.75 కోట్లతో గోదావరి ఘాట్ల ఆధునీకరణ, రూ.96 కోట్లతో క్షేత్ర సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.
