Headlinesబీసీల రిజర్వేషన్లపై శాసనమండలిలో డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్

బీసీల రిజర్వేషన్లపై శాసనమండలిలో డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్

Link Copied!

శాసనమండలిలో డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారు బీసీల రిజర్వేషన్ల గురించి ఈ విధంగా ప్రసంగించారు…..

బీసీలు రాష్ట్రంలో 56% ఉన్నప్పటికీ, బడ్జెట్‌లో వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు.
కేటాయించిన నిధులు తక్కువగా ఉండటమే కాకుండా, విడుదల చేసిన వాటిలో కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదని చెప్పారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులు 100% వినియోగం కావడం లేదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతుందని పేర్కొన్నారు.
బీసీ సబ్ ప్లాన్ కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ ప్లాన్ ను ఏర్పాటు చేస్తామన్నారు కానీ ఇప్పటివరకు అది జరగలేదు.
కామారెడ్డి డిక్లరేషన్, కమిషన్ రిపోర్టులు, రిజర్వేషన్లు వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
బీసీ కార్పొరేషన్లు, భవనాలు, గురుకులాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలు అమలు కాలేదని అన్నారు.
బీసీల పట్ల ప్రభుత్వ వైఖరి మార్చి, నిధులను పూర్తిగా వినియోగించి సమాన అభివృద్ధి సాధించాలని మంత్రి గారిని కోరారు.

తాజా వార్తలు

Related Articles